Prajavani | మెదక్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : అధికారులు జవాబుదారుగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీ ఆర్డిఓ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించి-50, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు – 20, పింఛన్లు -03, ఎంప్లాయిమెంట్ -05, ఇతర సమస్యలు -41 మొత్తం 119 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన