ఝరాసంగం, నవంబర్ 22: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడి ్డజిల్లా ఝరాసం గం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఉన్న కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం 6ఏ జాబితాలో ఉంది. ఆలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి, ఉత్సవాలు, జాతర్ల నిర్వహణ కోసం దేవదాయ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తున్నది.
ఆలయ ధర్మకర్తల మండలి పదవీకాలం గతేడాది అక్టోబర్లో ముగిసింది. పాలకమండలి లేకపోవడంతో ఆలయం అభివృద్దికి నోచుకోలేదు. ఆలయ ధర్మకర్తల మండలిలో 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ లేదా ఎస్టీలకు ఒకటి, మహిళలకు ఒకటి, ఒక డోనర్కు అవకాశం ఉంది. ఆలయ ప్రధాన పూ జారి ఎక్స్ అఫీషియా మెంబర్గా ఉంటా రు. ఆలయ చైర్మన్, ధర్మకర్తల పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురే శ్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమంత్ రావు పటేల్ వద్దకు వెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసక్తి గలవారు సంగారెడ్డిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం లో రెండు వారాల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ఈవో శశిధర్ సూచించారు. సత్ప్రవర్తన కలిగి, వయస్సు 35 ఏండ్లకు పైబడిన వారు, పోలీస్ కేసులు లేనివారు ధర్మకర్తల మండలి పోస్టుకు అర్హులన్నారు.