రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్‌లను ఉచితంగా అందజేస్తూ నిరుపేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో నిర్మించిన 48 డబుల్ ఇండ్లను ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు, క్రీడాపరికరాలను డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి వారు అందజేశారు. నిజాంపేట మండలం నందిగామలో ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్ ప్రీతితో కలిసి 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అందజేశారు.
– వెల్దుర్తి/ నిజాంపేట,అక్టోబర్ 8
వెల్దుర్తి, అక్టోబర్ 8: గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
మండల పరిధిలోని ఉప్పులింగాపూర్‌లో నిర్మించిన 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను ఆదివారం లబ్ధిదారులకు, మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు ముఖ్యమంత్రి క్రీడాపరికరాలను డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడు తూ ప్రతి కుటుంబానికి సొంత ఇలు నిర్మించుకోవాలనేది కల అని, అలాంటి వారి కలను సీం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ సర్కార్ నెరవేస్తున్నదన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు అందిస్తున్నదని వివరించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మహిళలు ప్రత్యేకంగా జరుపుకొనే, పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఈ పండుగకు రాష్ట్ర సర్కారు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిందన్నారు. బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంత యువకుల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ప్రభు త్వం తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి క్రీడాపరికరాలను అందిస్తున్నదన్నారు. యువకులు ఈ క్రీడా పరికరాలను సద్వినియోగం చేసుకుని, ఎ దగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ భాగ్యమ్మభూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, అంజనేయులు, సునందారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఖాజా, చందు, మైసయ్య, రాజు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.