శివ్వంపేట, జూలై 28 : విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని దొంతి, సీతారాం తండా గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాసులుతో కలసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు ధైర్యం చెప్పారు. త్వరలోబాధితులందరికీ నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. ఇంకా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం మెదక్ రెడ్‌క్రాస్ స్వ చ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 20మంది బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, బ్లాంకెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఆర్ఐ కిషన్, సర్పంచ్‌లు సోనీరవినాయక్, ఫణీశాషాంక్శర్మ, చంద్రకళాశ్రీశైలంయాదవ్, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ ఆలేటి రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్యాద వ్, కార్యదర్శి సుభాష్‌చంద్రబోస్, కోశాధికారి శ్రీనివాస్‌శర్మ, ఈసీ సభ్యుడు దేమె యాదగిరి, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, రాజశేఖర్ గౌడ్, బొద్దుల భిక్షపతి పాల్గొన్నారు.