వెల్దుర్తి/నర్సాపూర్/కొల్చారం/చిలిపిచెడ్, నవంబర్ 21: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సునీతారెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. ఈమేరకు మంగళవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఇంటింటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. మాసాయిపేట మండలంలోని రామంతాపూర్తండాలో సునీతాలక్ష్మారెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనునాయక్ తండాల్లోని యువకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉందని, ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఎన్నికల్లో అందరం సమన్వయంతో ముందుకు సాగాలని, తొమ్మిదిన్నర ఏండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కృష్ణాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, వెంకటేశం, రమేశ్, మల్లేశతో పాటు పలువురు నాయకులు, శెట్పల్లిలో నాయకులు పడిగె నర్సింలు, సిద్ధిరాములు, బాలేశ్, గ్రామ నాయకులు, ప్రజలతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
* చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్‌లో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలంటూ ఆమె చిన్నకోడలు రుత్వికరెడ్డి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో వివరాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కారు గుర్తుకు ఓటేసి సునీతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్‌చైర్మన్ రాంచెంద్రారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీదుర్గారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మనోహర నరసింహారెడ్డి, కవితా ముకుందరెడ్డి, ఫైజాబాద్ ఎంపీటీసీ మల్లమ్మ సంగగౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు షఫీ, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు సయ్యద్ హుస్సేన్, నాయకులు విఠల్, జైపాల్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
* తెలంగాణ ప్రభుత్వ అమలు సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తూ.. మీ ఓటు కారు గుర్తుకే అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా కొల్చారం మండలంలో మంగళవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కొల్చారం మండలం వరిగుంతంలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి విజయం కోసం సునీతారెడ్డి కోడలు కీర్తిరెడ్డి, జడ్పీటీసీ మేఘమాల, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సునీతారెడ్డికి అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసని, కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోశ్‌రావు, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ అరిగె రమేశ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేమారెడ్డి, యాదగిరి, నర్సింహులు, ఎండీ సాజిద్‌ఖాన్, వడ్ల శ్రీనివాస్, ఆది లక్ష్మయ్య, మండల గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, మాజీ సర్పంచులు శ్రీధర్‌గౌడ్, నీరుడి లక్ష్మయ్య, విజయ్‌కుమార్, సోమ నర్సింహులు, రవీందర్, ఆత్మ డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయిలు తదితరులు పాల్గొన్నారు.
* నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. నర్సాపూర్ మున్సిపల్ 15వ వార్డులో కౌన్సిలర్ లలితాభిక్షపతి ఆధ్వర్యంలో సునీతాలక్ష్మారెడ్డి తరుఫున మంగళవారం గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.