పోలీస్ బాస్‌ల బదిలీ
మెదక్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రోహిణిప్రియదర్శిని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా, సిద్దిపేట సీపీగా విధులు నిర్వహిస్తున్న ఎన్. శ్వేత హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఎన్.శ్వేత
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రోహిణిప్రియదర్శిని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా, సిద్దిపేట సీపీగా విధులు నిర్వహిస్తున్న ఎన్. శ్వేత హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-మెదక్ అర్బన్/సిద్దిపేట అర్బన్, డిసెంబర్17
మెదక్ అర్బన్, డిసెంబర్ 17: మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బదిలీలో భాగంగా మెదక్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆమె హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా నియామకమయ్యారు. మెదక్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకున్న రోజు నుంచి మెదక్ జిల్లాలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం షీ టీమ్స్, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించారు.
సిద్దిపేట సీపీ శ్వేత బదిలీ..
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 17 : సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్వేత బదిలీ అయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆమె డిసెంబర్ 26, 2021లో సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ (డీడీ)గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట మొదటి మహిళా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేత రెండేండ్లుగా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా షీ టీమ్స్, భరోసా వంటి కార్యక్రమాలతో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కృషి చేశారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని యువత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీపీ శ్వేత ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో హాఫ్ మారథాన్‌తో పాటు కమిషనరేట్ పరిధిలోని పలు పట్టణాల్లో మారథన్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

