Accident insurance | రామాయంపేట, జూన్ 24 : ఎస్బీఐ బ్యాంకులో రూ.2 వేల రుసుముతో ఖాతాదారులు బీమాను చేసుకుంటే ప్రమాదంలో మృతి చెందితే భీమా డబ్బులు రూ.40లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందని ఎస్బీఐ ఆర్ఎం మారుతి పేర్కొన్నారు.
మంగళవారం రామాయంపేట ఎస్బీఐ బ్యాంకులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన చేగుంట మండలానికి చెందిన సీఆర్పీ రమేశ్ కుటుంబానికి రూ.40 లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ.. ఎస్బీఐలో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారుడు ఈ ప్రమాద బీమాను చేసుకోవాలన్నారు.
కేవలం రూ.2వేలు చెల్లిస్తే ప్రమాద బీమా డబ్బులు రూ.40 లక్షలు వస్తాయన్నారు. ఎస్బీఐ కల్పిస్తున్న ఈ ప్రమాద బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్బీఐ బ్యాంకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది ఉన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు