MLA Sunitha laxma Reddy | నర్సాపూర్, మార్చి20 : స్వచ్చంద సంస్థల పేరుతో చెరువు, కుంటల నుండి తరలిస్తున్న అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని మండలాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులకు, రైతులకు కాకుండా అక్రమంగా చెరువులోని, కుంటల్లోని మట్టిని తరలిస్తే అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. అధికారులకు, తనకు ఎలాంటి సమాచారం లేకుండానే అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలోని చెరువు, కుంటలకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు.
కాళేశ్వరం కాలువ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, కాలువ పనులు పూర్తయితే మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుండి సాగునీరు వస్తాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు బాగుపడ్డాయని ఇప్పుడు స్వచ్చంద సంస్థల పేరుతో మట్టిని తీసి చేసేది ఏమి లేదని అన్నారు.
అనంతరం నియోజకవర్గ స్థాయి మండలాల ఇరిగేషన్ అధికారులతో చెరువు, కుంటల సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఇరిగేషన్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు