challans | రామాయంపేట, జూలై 12 : పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే ఆటోవాలాలు ఛలానాలు కట్టాల్సిందేనని రామాయం పేట ఎస్సై బాలరాజు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట-మెదక్ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులు వాహనం కాగితాలతోపాటు తమ భద్రత కోసం బైకులు నడిపించే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.
హెల్మెట్‌ను ధరించాలని పోలీస్ స్టేషన్లో, గ్రామాల్లో సైతం ప్రచారాలు చేస్తున్నామని అయినా కొంత మంది అశ్రద్దగా ప్రవర్థిస్తూ హెల్మెట్లు వాడకుండానే రోడ్డుపై వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆటోలలో సైతం ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారని.. ఇది పద్దతి కాదన్నారు. లారీల డ్రైవర్లు తమకు వచ్చిన ఫెనాల్టీలను వెంటనే మీ సేవ ద్వారా చెల్లించాలని లేకుంటే కేసులు నమోదవుతాయన్నారు.
ప్రతి ఒక్క కారు గానీ ఆటోలు గానీ నడిపేవారు సీట్‌బెల్టును పెట్టుకోవాలన్నారు. పోలీస్ నిబంధనలను కచ్చితంగా అందరూ పాటించాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి