సిద్దిపేట,అక్టోబర్13: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి అనాగరికమని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. భారత చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముకపల్లి రాజు మాదిగ అధ్యక్షతన నిరసన చేపట్టారు.అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మందకుమార్ మాదిగ మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైందన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నామన్నారు.ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
దళిత, పీడిత వర్గాలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. దళితుడైన బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు మల్లిగారి యాదగిరి ,దండు శంకర్,సామ్రాట్ ప్రకాశ్,మైసరాములు , ఎనగండుల లక్ష్మీనారాయణ, సుంచు రమేశ్, సరవల ప్రసాద్, చింతగింది పరశురాములు, ముండ్రాతి కృష్ణ , శంకర్, ఆంజనేయులు, మహేశ్, శ్రీహరి, వెంకటేశ్, ముకపల్లి కనకరాజు, దేవదానం, శ్యామ్ కుమార్,మొండి రమేశ్, చంద్రశేఖర్, రజనీకాంత్, శరత్ బాబు, సామిల్, నత్తి శీను, చంద్రం, పెంట య్య ప్రసాద్, అశ్వథామ , ప్రకాశ్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.