చేగుంట, అక్టోబర్ 21 : అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు సుపరిపాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి, పార్టీకి దూరమైన పలు వురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చేగుంట పట్టణానికి చెందిన తీగల భూంలింగంగౌడ్ ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడిగా కొనసాగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన భూంలింగంగౌడ్ శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాలీ కండువా కప్పుకొని బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా భూంలింగౌడ్ మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలు, రైతుల అభివృద్ధి లక్ష్యం గా ఎన్ని కల హామీ ఇచ్చారన్నారు. ఇంటింటికి తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తామని భూంలింగంగౌడ్ తెలిపారు.
చేగుంట మండల చెట్లతిమ్మాయిపల్లి ఎంపీటీసీ హోళీయానాయక్ కొందరి మాయమాటలు నమ్మి బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని గమనించి మనస్సు మార్చుకున్నారు. ఈ మేరకు దుబ్బాకలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, బీఆర్ఎస్ కోర్ కమిటీ ఆధ్యర్యలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో ఎంపీటీసీ హోళీయానాయక్ చేరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీఆర్ఎస్తోనే తీరుతాయని ఆయన అన్నారు.