కంది, నవంబర్ 14: రాష్ట్రంలో ప్రజాపాలన పడకేసిందని, కాంగ్రెస్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. గురువారం కందిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయచ్చని, కానీ.. వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని సీఎంను ప్రశ్నించారు. నాడు ఖమ్మం మిర్చి యార్డు, మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం ధర్నా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అర్థరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.