గజ్వేల్, జూలై 14: బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ సీఎం రేవంత్‌రెడ్డి శునకానందం పొందుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతనం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రోజూ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నాడన్నారు.
కేసులను అడ్డం పెట్టుకొని పనులు ఇస్తామనో, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే వేదికల మీదికి పిలవమనో, ఎస్కార్టు ఇవ్వమనో, పోలీసులచే కేసులు పెట్టిస్తామనో భయపెట్టి చేస్తున్న నీచ రాజకీయాల ఫలితాలను నాలుగున్నర సంవత్సరాల తర్వాత రేవంత్‌రెడ్డి తప్పకుండా అనుభవిస్తాడన్నారు. పశువులను సంతలో కొంటున్నట్లు ఎమ్మెల్యేలను కొం టుంటే రాహుల్‌గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎందుకు తెలంగాణ న్యా యమూర్తులు మౌనంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడతలేరన్నారు. కార్యక్రమంలో నాయకుడు జశ్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.