దుబ్బాక,ఆగస్టు12: రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కారణంగా దవాఖానకు రోగుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఇక్కడ ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందడం లేదని, ఈ విషయంపై త్వరలోనే వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కరిస్తానన్నారు.
దు బ్బాక దవాఖానకు గ్రామీణ ప్రాంత ప్రజలే అత్యధికంగా వస్తారని , ఇక్కడ మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దవాఖాన కు రూ.50 లక్షల అంబులెన్స్ అందజేసిన విషయా న్ని గుర్తు చేశారు. అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యసేవలందడం సం తోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ హేమరాజ్, వైద్యసిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.