కౌడిపల్లి, నవంబర్ 4: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మెదక్ ఎం పీ రఘునందన్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహమ్మద్‌నగర్ శివారులో ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం బాధాకరమన్నారు.
అధికారంలో వచ్చేందుకు ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నధాన్యానికే ఇస్తామని చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి 40శాతం మంది రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోగా, ఒక్కొక్కరికీ రూ.15 నుంచి రూ.20 లక్షల బకాయి ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేసి వారి ని ఆదుకోవాలన్నారు.కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.