సిద్దిపేట, జూలై 28: జిల్లాలోని రంగనాయక సాగర్‌పై ఆదివారం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మా రథాన్ రెండో ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. మెదక్ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు ఈ మారథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతి ఒకరూ నడకను అలవాటు చేసుకోవాలన్నారు.
వ్యాయామం ద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చన్నా రు. ఈ పోటీల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించడంపై అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ మారథాన్ లో 3000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమా లు అలరించాయి. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాపురెడ్డి, రన్నర్స్ నిరంజన్, వెంకటేశ్, జనగామ సీఐ రఘుపతి రెడ్డి, హరి, చారి, సురేశ్, శ్రీనివాస్, రవి, నర్సింహులు, వేణు తదితరులు పాల్గొన్నారు.
రంగనాయక సాగర్‌పై నిర్వహించిన హాఫ్ మారథాన్ రెండో ఎడిషన్ 5,10,21 కిలోమీటర్ల విభాగం పోటీల్లో 21 కిలోమీటర్ల పురుషుల విభాగంలో యోగేందర్యాదవ్, రమావత్ రమేశ్చంద్ర, సోనుకుష్వా, మహిళల వి భాగంలో మరుపల్లి ఉమ, వడ్డే నవ్య, మ ద్దూరి కావ్య విజేతలుగా నిలిచారు. 10 కిలోమీటర్ల పరుగు పందెం పురుషుల విభాగం లో పంకజ్ సింగ్, సునీల్‌కుమార్, మహేశ్‌కుమార్, మహిళల విభాగంలో మహేశ్వరి, కొడావత్ స్వప్న, రాజేశ్వరి వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఐదు కిలోమీటర్ల పురుషుల విభాగంలో చంద్రశేఖర్, సామ్యూల్, ఈశ్వర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.