సిద్దిపేట, సెప్టెంబర్ 18: ఆయిల్‌పామ్ సాగుకు మరింత మంది రైతులు ముందుకు రావాలని, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్ పంటల సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇటీవల అశ్వరావుపేటకు వెళ్లి ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా సాగుచేస్తున్న కోకో వక పంటలను సందర్శించిన రైతులతో గురువారం హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ& జిల్లాలో ఆయిల్‌పామ్ తోటలు వేసి నాలుగేండ్లు గడిచిందని, వాటి ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పామాయిల్ దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 28% నుంచి 18% తగ్గించిందన, దీనిపై బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఆయిల్ పామ్‌లో తోటల్లో కోకో సాగుకు ఎకరానికి రూ.12 వేల రాయితీ లభిస్తోందన్నారు. అదనంగా 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం రైతులకు వస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌రావు కోరారు. మీరే ఆయిల్‌పామ్ బ్రాండ్ అంబాసిడర్లని, మరింత సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.