గన్నీ బ్యాగులు.. వాపస్ తీసుకోం..!
వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలకు సరఫరా అయిన గన్నీ బ్యాగులు తిరిగి ఇచ్చేందుకు వస్తే మహిళ సంఘాల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లుల నుంచి మిల్లర్లు గన్నీ బ్యాగులను తొలి విడతలో సరఫరా చేశారు.
- మహిళా సంఘాల నుంచి తీసుకోవడానికి ఎంఎల్ఎస్ పాయింట్ అధికారుల నిరాకరణ
- ఆందోళనకు గురవుతున్న కేంద్రాల నిర్వాహకులు
- సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇదే తంతు
చేర్యాల, జూలై 15 : వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలకు సరఫరా అయిన గన్నీ బ్యాగులు తిరిగి ఇచ్చేందుకు వస్తే మహిళ సంఘాల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లుల నుంచి మిల్లర్లు గన్నీ బ్యాగులను తొలి విడతలో సరఫరా చేశారు. అవి సరిపోకపోవడం తో మరిన్ని బ్యాగులను పౌరసరఫరాల విభా గం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఆయా గ్రామాల మహిళా సంఘాలకు పంపించారు. వడ్ల కొనుగోళ్లు పూర్తికావడంతో మహిళలు గన్నీ బ్యాగులను చేర్యాలలోని పౌరసరఫరాల గోడౌన్ వద్దకు ఇవ్వడానికి తెసే అక్కడి అధికారి, సిబ్బంది తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
గతంలో వారు తీసుకున్న ట్రక్ షీట్స్ అధారంగా మహిళలు చేర్యాల పౌర సరఫరాల గోడౌన్ వద్దకు 15 రోజుల నుంచి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలకు చెందిన మహిళలు గన్నీ బ్యాగు లు తెస్తున్నారు. వాటిని తీసుకోకుండా అధికారులు సాకులు చెబుతున్నారు. కొన్ని మా త్రమే తీసుకుని, మిగిలినవి రైస్‌మిల్లర్లకు ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. మద్దూరు మం డలం వ్యాన్ల నిండుగా గన్నీ బ్యాగులు మహిళలు తీసుకువచ్చారు. తీరా, ఇవి మేం ఇవ్వలేదు, రైస్‌మిల్లుల వారికి ఇవ్వండి అం టూ వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉంచారు. కొన్ని గన్నీ సంచులు తీసుకుని మిగిలినవి తీసుకుని వెళ్లిపోవాలని అనడంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయలేక తిరిగి గన్నీ బ్యాగులు తీసుకువచ్చిన వ్యాన్‌లో వాటిని తిరిగి వారి గ్రామాలకు మహిళలు తీసుకుపోయారు.
కొమురవెల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళలుగన్నీ బ్యాగులు తీసుకువస్తే వారి నుంచి కొన్ని తీసుకుని మరి న్ని వాపస్ పంపించినట్లు సమాచారం.ఒక్కో గన్నీ బ్యా గు రూ.40 చొప్పున రేటు పలుకుతున్నది. ఇదే అదనుగా భావించి, వాటిని మహిళా సంఘాలకు అంటగడితే, వారికి ఆర్ధికంగా లాభం చేకూరనుండడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇదో రకం కుంభకోణానికి జిల్లా వ్యాప్తంగా తెరలెపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రాల నుంచి మిగిలి ఉన్న గన్నీ బ్యాగులను పౌరసరఫరాల అధికారులు తీసుకోని పక్షంలో ఒక్కో బ్యాగుకు రూ.4 0 చొప్పున కేంద్రాలు నిర్వహించిన మహిళా సంఘానికి వచ్చే కమీషన్లో ఆ డబ్బులు కట్ చేసుకొనున్నారు. ఇదే జరిగితే మహిళలు తమ కష్టాన్ని గన్నీ బ్యాగుల రూపంలో కోల్పోనున్నారు.జిల్లా అధికారులు స్పందించి ఈ విషయంలో తగు విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

