అందోల్, ఏప్రిల్ 30: రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మీదుగా బోధన్ వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేస్తున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని..కానీ నేటి పాలకులు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత ప్రజా సంక్షేమాన్ని గాలికోదిలేశారని మండిపడ్డారు.కౌన్సిలర్ శోభానారాయణగౌడ్, నాయకులు నర్సింహులు, వెంకటేశం, ప్రదీప్గౌడ్, రమణ, సాయికుమార్ ఉన్నారు.