హుస్నాబాద్, నవంబర్ 21: హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అయితే ఇచ్చిన హామీలను ఎగవెట్టి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే ఎన్ని అబద్ధాలు చెప్పయినా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోకు మంత్రి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పథకాలను, మ్యానిఫెస్టోను కాపీ కొట్టి ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టకుంటే రూ.35వేల కోట్ల నిధులను ఆపామని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఒప్పుకోవడం బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. పదేండ్లలో నియోజకవర్గంలో రూ.కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చి మాయమాటలు చెప్పేవారి మాటలు నమ్మొద్దన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, రాబోయే రోజుల్లోనూ రోల్ మోడల్‌గా చేస్తానని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ను గోదావరి నీళ్లతో నింపామని, చెరువులు, కుంటలను అభివృద్ధి చేశామని తెలిపారు. 16విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించి నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 100 పడకల దవాఖాన, ఐవోసీ భవన నిర్మాణం, డిపోను అభివృద్ధి చేశామన్నారు. సీఎంకేసీఆర్, మంత్రి హరీశన్న సహకారంతో నియోజకవర్గాన్ని మరిం త అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజనీతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పేర్యాల రవీందర్రావు, వెంకట్రాంరెడ్డి, అన్వర్, తిరుపతిరెడ్డి, ఆకు ల వెంకట్, చిట్టి గోపాల్‌రెడ్డి, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, గవ్వ వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జిలు, గ్రామాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.