మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
హుస్నాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్‌లో మంత్రి ప్రారంభించబోయే అభివృద్ధి పనులు, హెలీప్యాడ్, బహిరంగసభ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
- పరిశీలించిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
హుస్నాబాద్, మే 4: హుస్నాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్‌లో మంత్రి ప్రారంభించబోయే అభివృద్ధి పనులు, హెలీప్యాడ్, బహిరంగసభ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఉదయం 10గంటలకు మినీస్టేడియంలో ల్యాండ్ అవుతారని, పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం డిపో గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు.
మంత్రి పర్యటనలో ఎలాంటి అలసత్వం వహించొద్దని, మంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ మానస, తహసీల్దార్ గైసున్నీసాబేగం, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, ఏఈలు, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రామ్రెడ్డి, అన్వ ర్, తిరుపతిరెడ్డి, బీలూనాయక్, ఆకుల వెంకట్, క్రాంతిరెడ్డి, చిరంజీవి, విజయభాస్కర్, వికాస్, రాజునాయక్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

