Metabolism | వయస్సు పెరిగే కొద్దీ తగ్గే మెటబాలిజం.. దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి..?
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవక్రియల (మెటబాలిజం) వేగం సహజంగానే తగ్గుతుంది. చిన్నతనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం, పెరుగుతున్న వయసులో అంత తేలికగా జీర్ణం కాకపోవడంతోపాటు బరువు కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.
Metabolism | వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవక్రియల (మెటబాలిజం) వేగం సహజంగానే తగ్గుతుంది. చిన్నతనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం, పెరుగుతున్న వయసులో అంత తేలికగా జీర్ణం కాకపోవడంతోపాటు బరువు కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, ధూమపానం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు కండరాల పరిమాణాన్ని తగ్గించి మెటబాలిజాన్ని మరింత మందగింపజేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా జీవక్రియల వేగాన్ని మెరుగుపరచుకోవచ్చు. కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మెటబాలిజాన్ని పెంచడంలో కొంతవరకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం వల్ల వచ్చే అదనపు బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక గ్రాము మిరపకాయ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మరో అధ్యయనం ప్రకారం ఐదు గ్రాముల మిరపకాయలు తీసుకోవడం వల్ల సుమారు 30 నిమిషాల పాటు మెటబాలిజం దాదాపు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తేలింది.
కార్డియో వ్యాయామాలు, ప్రోటీన్లు..
కార్డియో వ్యాయామాలు కేలరీలను కరిగించడంలో ఉపయోగపడితే, వెయిట్ ట్రైనింగ్ కండరాల పరిమాణాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వుతో పోలిస్తే కండరాలు ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. వృద్ధులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో 16 వారాల పాటు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతోపాటు మెటబాలిజం కూడా మెరుగుపడినట్లు గుర్తించారు. కొన్ని పరిశోధనల్లో ఈ వ్యాయామం మహిళల్లో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ కండరాల నిర్మాణాన్ని, సంరక్షణను ప్రోత్సహిస్తుంది. దీంతో శరీరం విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలను ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకునే వారిలో విశ్రాంతి సమయంలో జీవక్రియల వేగం అధికంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అల్పాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి..
ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయకూడదు. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవడం వల్ల రోజంతా అనవసరంగా చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. మధ్య మధ్యలో తీసుకునే చిరుతిండ్లలో ఎక్కువగా చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తీసుకునే వారు రోజంతా ఎక్కువ కేలరీలను ఖర్చు చేసే అవకాశం ఉంటుందని వెల్లడైంది. తగినంత నీరు తాగడం కూడా మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. ముఖ్యంగా చల్లని నీటి కంటే గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

