చిన్న చీమ.. పెద్ద సందేశం!
కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న సంఘటనలే గొప్ప జీవిత పాఠాలను నేర్పిస్తాయి. అందుకు పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ప్రకృతిలోని ఓ చిన్న జీవిని గమనిస్తే చాలు. బాధ్యత అంటే ఏమిటో, సమాజం పట్ల ప్రేమ ఎలా ఉండాలో, నిస్వార్థం అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. సులైమాన్ (అలైహిస్సలాం) ప్రవక్త కాలంలో జరిగిన ఒక చిన్న చీమ కథ ఇందుకు అద్భుతమైన ఉదాహరణ.
కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న సంఘటనలే గొప్ప జీవిత పాఠాలను నేర్పిస్తాయి. అందుకు పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ప్రకృతిలోని ఓ చిన్న జీవిని గమనిస్తే చాలు. బాధ్యత అంటే ఏమిటో, సమాజం పట్ల ప్రేమ ఎలా ఉండాలో, నిస్వార్థం అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. సులైమాన్ (అలైహిస్సలాం) ప్రవక్త కాలంలో జరిగిన ఒక చిన్న చీమ కథ ఇందుకు అద్భుతమైన ఉదాహరణ.
ఒకరోజు.. సులైమాన్ (అలైహిస్సలాం) ప్రవక్త తన భారీ సైన్యంతో ప్రయాణిస్తున్నారు. ఆ సైన్యంలో మనుషులు, జిన్నాతులు, పక్షులు ఉన్నారు. అలా ప్రయాణిస్తూ వారు చీమలు నివసించే ఒక లోయకు చేరుకున్నారు. సైన్యం తమ నివాసాల మీదుగా వెళితే తమ జాతి మొత్తం నాశనమవుతుందని గ్రహించిన ఓ చిన్న చీమ వెంటనే తన సమాజాన్ని అప్రమత్తం చేసింది.
‘ఓ చీమలారా! సులైమాన్, ఆయన సైనికులు మీకు తెలియకుండానే మిమ్మల్ని తొక్కివేయకుండా ఉండేందుకు మీ నివాసాల్లోకి వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.ఆ చిన్న చీమ పలికిన మాటలు సులైమాన్ (అలైహిస్సలాం)కు వినిపించాయి. వాటిని అర్థం చేసుకున్న ఆయన చిరునవ్వు నవ్వారు. తనకు అల్లాహ్ ప్రసాదించిన అపారమైన అనుగ్రహాలను గుర్తుచేసుకుని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. తన సైన్యానికి మార్గం మార్చమని ఆదేశించారు. అలా ఒక చిన్న చీమ తన సమాజాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడింది. ఈ అద్భుతమైన సంఘటనను పవిత్ర ఖురాన్లోని సూరహ్ అన్-నమ్ల్ 18, 19వ ఆయతుల్లో అల్లాహ్ ప్రస్తావించాడు.
ఈ కథలో మనల్ని ఆలోచింపజేసే అంశం ఒకటుంది. ఆ చీమకు అధికారం లేదు. అపారమైన సంపద లేదు. శారీరక బలం లేదు. అయినా తన సమాజం పట్ల అపారమైన బాధ్యత ఉంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, తనవారిని కాపాడేందుకు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేటి సమాజంలో మన చుట్టూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి. అన్యాయం, అణచివేత, స్వార్థం, వివక్ష, దోపిడీ నిత్యజీవితంలో భాగమైపోతున్నాయి. కానీ వాటిని చూసి స్పందించేవారు ఎంతమంది? ఒక చిన్న చీమ తన సమాజం కోసం ముందుకొచ్చింది. మరి సమస్త జ్ఞానం, విజ్ఞానం, ఆలోచనాశక్తి కలిగిన మనిషి కూడా ఆ చీమలా ఆలోచిస్తే.. ఈ ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

