చండూరు, ఆగస్టు 02: అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోడంగిపర్తి గ్రామం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రేవల్లి నరేష్‌కు ప్రభాకర్ రెడ్డి ఆర్ధిక సాయం అందజేశారు. ఆదివారం నిమ్స్‌కు వెళ్లిన ఆయన అక్కడ.. నరేష్‌ను పరామర్శించి వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, 7వ వార్డు మెంబర్ రేవల్లి నరేష్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. రెండు మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకు ఇన్స్పెక్షన్ కారణంగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు నరేష్. కొన్ని రోజులుగా నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న నరేష్‌ను మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.

ఆదివారం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి .. డాక్టర్లతో మాట్లాడి నరేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అతడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ప్రభాకర్ రెడ్డి కోరారు. ‘ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడవద్దని, మీకు అండగా నేనున్నా’ అని నరేష్‌కు, అతడి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే తన వంతు సాయంగా రూ. 20 వేలు అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు నరేష్‌ను పరామర్శించిన వారిలో బోడంగిపర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, 2 వార్డ్ మెంబర్ వట్టికోటి శ్రీనివాస్, వర్కాల శ్రవణ్, ఎండి సత్తార్, రేవెల్లి శ్రీను, రేవెల్లి మహేష్, వర్కాల అంబేద్కర్ ఉన్నారు.