సిద్దిపేట, ఆగస్టు 17 : హైదరాబాద్ నుంచి సిద్దిపేట క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు. అభిమానులు, గులాబీ శ్రేణులతో సిద్దిపేట క్యాం పు కార్యాలయం కోలాహలంగా మారింది.
సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హరీశ్ అన్న జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా హరీశ్‌రావు అందరితో కరచాలనం చేసి ఆనందం వ్యక్తం చేశారు.