గజ్వేల్, అక్టోబర్ 23: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కనున్న పాతూర్ కూరగాయల మార్కెట్‌ను బుధవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సందర్శించారు. రైతులను పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇంతకుముందు రో డ్డుపై అమ్ముకునే వాళ్లమని, మా కష్టాలను చూసిన మీరు మార్కెట్ నిర్మించి ఉపాధి చూపించారని కృతజ్ఞతలు తెలిపారు.