జహీరాబాద్, అక్టోబర్ 2: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూ ర్, వడ్డి, మల్గి గ్రామ శివారులో ప్రభు త్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉండనున్న ది. గురువారం ఆయా గ్రామాలకు చెందిన భూబాధితులు, ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుని అండగా ఉండేందుకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రానున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ తెలిపారు.
ఆయనతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కోనింటి మాణిక్‌రావు, ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నారాయణఖేడ్, అందోల్ మాజీ ఎమ్మెల్యేలు భూ పాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం హాజరుకానున్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన భూబాధితులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన సూచించారు.