నారాయణరావుపేట, సెప్టెంబర్ 4: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్‌లో తురకవాని కుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది. బుధవారం హరీశ్‌రావు రైతు పొలాన్ని పరిశీలించారు. ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేశారు.
మండలంలో గోపులాపూర్, మ ల్యాల, జక్కాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, మొత్తంగా నియోజకవర్గంలో 700 ఎకరా ల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. రెం డు కిలోమీటర్ల మేర బైక్‌పై, కిలోమీటర్ మేర పొలం గట్టుపై రైతుల వద్దకు వెళ్లి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కష్టకాలంలో, ఆపదలో తమ దగ్గరకు వచ్చి అండగా ఉండి ఆర్థిక సహాయం అందించిన హరీశ్‌రావుకు రుణపడి ఉంటామని రైతు దేవయ్య సంతో షం వ్యక్తం చేశారు.