నర్సాపూర్, జనవరి 24: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శుక్రవారం గ్రామసభలో ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడిన సంఘటన నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంటలో చోటుచేసుకుంది. పెద్దచింతకుంటలో శుక్రవారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మాయమాటలను, మోసపూరిత వాగ్ధ్దానాల ను ఆమె ఎండగట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఎమ్మెల్యే ప్రసంగించకుండా అడ్డుపడ్డారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వా దం నెలకొనడంతో ఎస్సై లింగం, పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పాలన ను సాగించారని వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాల్లో కోతలు విధిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పం చ్ శివకుమార్, మాజీ వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.