నర్సాపూర్, నవంబర్ 12: బీఆర్ఎస్ హయాంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులో వదిలే చేప పిల్లల సంఖ్య తగ్గిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువులో ఆమె చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హ యాంలో నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువులో 2 లక్షల 60 వేల చేప పిల్లలను వదిలితే ఈసారి 66 వేల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని 24 చెరువుల్లో 19 లక్షల 10 వేల చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు.
చేపల పెంపకంతో మత్స్యకారులకు లాభం చేకూరేలా ప్రభు త్వం చూడాలని సూచించారు. కొత్త వ్యక్తులకు సభ్యత్వం ఇచ్చి వారికి మెంబర్ షిప్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మత్స్యశాఖ ఏడీ మల్లేశం, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు షేక్‌హుస్సేన్, ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వినయ్, సద్దాం, సలీం, ఇర్ఫాన్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మెదక్ జిల్లా మత్స్యశాఖ ఏడీ మల్లేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువులో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాయారావు చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దానిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఫొటో కంటే ఎమ్మెల్యే ఫొటో చిన్నగా వేయించారు. దీనికి ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయంపై ఏడీ మల్లేశాన్ని పిలిపించిన ఆమె ప్రొటోకాల్ తెలియదా అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో తప్పిదం జరిగిందని, క్షమించాలని ఎమ్మెల్యేని మత్స్సశాఖ అధికారులు వేడుకున్నారు. ఇంకోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకోవాలని వారిని హెచ్చరించారు. చేప పిల్లలు వదిలే కార్యక్రమం ప్రారంభం కాకముందే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.