చిలిపిచెడ్, ఆగస్టు 31:రూ.2లక్షల పంట రుణమా ఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని రైతు వేదికలో 40 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులందరికీ రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పినా కనీసం 40 శాతం కూడా మాఫీ కాలేదని ఆరోపించారు. అర్హులందరికీ చేయలేక ఇంటింటి సర్వే చేస్తామని కొత్త నాటకానికి తెరతీశారని, అర్హులైన రైతులను గుర్తించేదెప్పుడు, పంటరుణమాఫీ అయ్యేదెప్పుడు అని ప్రశ్నించారు.
పంటరుణమాఫీ చేయలేక కాలయాపన కోసమే ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకా రం చుట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పంటరుణమాఫీ చేసినప్పుడు ఇవేమీ అడ్డంకులు పెట్టలేదని, కాంగ్రెస్ కొర్రీలు పెట్టి రైతులను ముప్పతిప్ప లు పెట్టడంతోపాటు ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. రైతులకు పంటరుణమాఫీ ముసుగులో రైతు బంధు కట్చేయడంతోపాటు వృద్ధులకు రూ.4వేల పింఛన్లు రద్దు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిలిపిచెడ్ మండలంలోని గిరిజన తండాల్లో బీటీ రోడ్ల కోసం అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.10కోట్లు రద్దు చేయడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, బీఆర్ఎస్ మాజీ మం డలాధ్యక్షుడు గడ్డం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు దుర్గారెడ్డి, సయ్యద్‌హుస్సేన్, కిషన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, షేఫియుద్దీన్, శంకరయ్య, భీమయ్య, వీరస్వామి, శం కర్నాయక్, భిక్షపతినాయక్, రాకేశ్‌నాయక్, సత్యం తదితరులు పాల్గొన్నారు.