శివ్వంపేట, నవంబర్ 3 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో దంతాన్పల్లి, కొంతాన్పల్లి, పోతులబోగుడ, ఉసిరికపల్లి, పిల్లుట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ మాజీ కోఆప్షన్ మన్సూర్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, రైతుసమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పీఏసీఎస్ సీఈఓ మధుయాదవ్, తూము కృష్ణారావు, రాజశేఖర్ గౌడ్, గూడూరు యాదగౌడ్, ఆకుల శ్రీనివాస్, చింతస్వామి, దుర్గం రమేశ్, శ్రీనివాస్ గౌడ్, ఏనుగు అశోక్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.