కౌడిపల్లి, నవంబర్ 10: ఎలాంటి ఆంక్షలు లేకుండా సన్నధాన్యంతోపాటు దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కుకుట్లపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల నుంచి పండించిన ధాన్యాన్ని త్వరగా కాంటా వేసి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లులకు తరలించాలన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. టార్పాలిన్ల కిరాయి రైతులకు తడిసి మోపెడవుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామాగౌడ్, కుకుట్లపల్లి మాజీ సర్పంచ్ కాంతారావు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్ ఎల్లం, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ప్రతాప్‌గౌడ్, నాయకుడు శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.