నర్సాపూర్, మే 11: ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీలో వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేశారు. సంగారెడ్డి మార్గంలోని సర్దార్ పాపన్న విగ్రహం నుంచి పాదయాత్రగా బయలుదేరి మున్సిపాలిటీలోని ప్రతి వీధికి తిరుగుతూ ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటేసి గెలిపిస్తామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రచారంలో రాష్ట్ర నాయకులు సంతోష్‌రెడ్డి, సత్యంగౌడ్, ఎన్నికల ఇన్‌ఛార్జి సింగాయిపల్లి గోపి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు సూరారం నర్సింహులు, షేక్ హుస్సేన్, వెంకట్, బాల్‌రెడ్డి, రాంచందర్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి పాల్గొన్నారు.
శివ్వంపేట, మే 11: వంద రోజులు గడిచినా కాంగ్రెస్ హామీలు అమలుకు నోచుకోక మోసపోయి గోసపడుతున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలోని సామ్యతండా, మార్లగడ్డ తండా, తుక్యతండా, గేమ్సింగ్తండా, బిక్యతండా, నానుతండా, తాళ్లపల్లితండా, సీతారాంతండా, కలురాంతండా, జగ్యతండా, భీమ్లాతండా, శంకర్‌తండా, తౌర్యతండాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్ గుప్తా, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు మర్రి సత్తిరెడ్డి, గోవింద్ నాయక్, సీనియర్ నాయకులు తూము కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, యాదగౌడ్ , రాజశేఖర్‌గౌడ్, అశోక్‌గౌడ్, మైసయ్య యాదవ్, గిరిజన నాయకుడు చెన్నానాయక్ పాల్గొన్నారు.
వెల్దుర్తి, మే 11: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ను గెలిపించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలో శనివారం వారంతపు అంగడిలో మండల నాయకులతో కలిసి ప్రచారం చేశారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటీ అమలుచేయలేదని మండిపడ్డారు.