MLA Sunitha Lakshma Reddy | శివ్వంపేట, సెప్టెంబర్ 29 : సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలంలోని స్వగ్రామమైన గోమారంలో బతుకమ్మను అలంకరించారు. ప్రతీ సంవత్సరంలాగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఈ ఏడాది కూడా తన కుటుంబ సభ్యులందరితో కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.
Vidadala Rajini | వైసీపీకి షాక్.. విడదల రజినీపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు!
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు మృతి