శివ్వంపేట, జూన్ 24: ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవాబ్‌పేట, చిన్నగొట్టిముక్ల, ఉసిరికపల్లి, దొంతి గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించనున్నట్లు, విద్యార్థులు బాల్యం నుం చే మంచి విద్యను అభ్యసించాలన్నారు.
చిన్నారులకు మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచించారు. ప్రభు త్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా మెరుగైన విద్య అందిస్తున్నట్లు గుర్తుచేశారు. అంతకుముందు చిన్నారులతో అక్షరభ్యాసం చేయించారు. వనమహోత్సవంలో భాగంగా టిక్యదేవమ్మగూడలో సర్పంచ్ తేజశ్విని రాజేందర్నాయక్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు తేజశ్విని రాజేందర్, నారాయణరావు, మర్రి సుజాతా కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు యాదాగౌడ్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మర్రి మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ పాపయ్యచారీ, మాజీ ఎంపీటీసీ నువ్వుల దశరథ, నరేందర్, ఎంఈఓ బుచ్యానాయక్, ఎంపీవో తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.