నర్సాపూర్, నవంబర్ 28: మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు.
2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన సందర్భంగా దీక్షను మరోసారి గుర్తుచేసుకోడానికి పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్‌హుస్సేన్, నర్సింహులు, జీవన్‌రెడ్డి, ప్రసాద్, మాజీ సర్పంచ్‌లు సేనాధిపతి, రవికుమార్, వెంకటేశ్ గౌడ్, శ్రీశైలం, సామ్యానాయక్, ఉమ్లానాయక్, ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.