నర్సాపూర్, అక్టోబర్ 28:ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేటీఆర్ బంధువుల ఇంటిపై పోలీసులు దాడి చేశారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారనే అక్కసుతో కేటీఆర్ బంధువులు చేసుకుంటున్న దావత్‌పై దాడి చేశారని ఆరోపించారు. అక్రమంగా, అన్యాయంగా ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండా కేటీఆర్ బంధువు గృహప్రవేశ దావత్‌పై దాడిచేయ డం దారుణమని మండిపడ్డారు.
ఇంట్లో దావత్‌లు చేసుకుంటే ఇప్పటికీ ఏ ప్రభుత్వం పర్మిషన్లు అడగలేదని గుర్తుచేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇన్వాల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేశారన్నారు. రాజకీయం గా, ప్రజాస్వామ్యంగా ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించా రు. కక్షసాధింపు చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపెట్టాలన్నారు. ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అనుక్షణం ఒత్తిడి తీసుకురావడం ధర్మమన్నారు. ఆ ధర్మాన్ని నేడు కేటీఆర్, హరీశ్‌రావు చేస్తుంటే వారిపైన అన్యాయంగా కేసు లు పెట్టి ఏదోరకంగా జైలుకు పంపాలనే ఆలోచన సిగ్గుచేటన్నారు.
దీపావళికి బాం బులు పేల్చుతామని ఓ మంత్రి అన్నాడని, ఆ బాంబు ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. చివరికి ఆ బాంబు తుస్సుమందని హేళన చేశారు. ఎక్సైజ్ అధికారులు సైతం ఎలాం టి డ్రగ్స్ దొరకలేదని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. అధికారంలో ఉండి మీరు ఇలా చేస్తే రేపు మేము అధికారంలోకి వచ్చి న తర్వాత ఇదే చేయా లా అని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ బాబ్యానాయక్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు షెక్హుస్సేన్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.