కల్హేర్, డిసెంబర్ 28: పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. గురువారం మండలకేంద్రమైన కల్హేర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇం డ్లు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ముందు గా నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామన్నారు. ఏవైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చి న ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నర్సింహారావు, తహసీల్దార్ బాలశంకర్, గ్రామ సర్పంచ్ లచ్చవ్వబాలయ్య, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.