కొమురవెల్లి, అక్టోబర్ 3: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన బాధిత బాలిక కుటుంబసభ్యులను గురువారం రాత్రి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివిధాలుగా అండగా ఉంటానని, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.
అనంతరం లెనిన్నగర్కు చెందిన ములుగు యాదయ్య, బత్తుల నర్సింహులు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.