చేర్యాల, అక్టోబర్ 25 : జనగామ నియోజకవర్గ ప్రజలకు పైసాఖర్చు లేకుండా తన సొంత దవాఖానలో వైద్యసేవలు, మందులు అందిస్తున్నానని, దీంతో పాటు ఇతర దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయిస్తున్నానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం చేర్యాలలోని ఓ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన 64 మందికి రూ.17,94,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు పాలనలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థ్ధిక సహాయం అధికంగా ఉం డేదని, అదే కాంగ్రెస్ పాలనలో రూ.60వేలకు మంచి మంజూరు కావడం లేదన్నారు. దీంతో బాధితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి 10 నెలల కాలంలో 750 చెక్కులను మంజూరు చేయించానని, మరో 15 రోజుల్లో 150 చెక్కులు మం జూరు అవుతాయని చెప్పారు.
మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మున్సిఫల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, ముస్త్యాల నాగేశ్వర్రావు,అనంతుల మల్లేశం, గీస భిక్షపతి, వుల్లంపల్లి కరుణాకర్, సిలువేరు సిద్ధప్ప, సుంకరి మల్లేశం,తలారి కిషన్, రాజేందర్‌రెడ్డి, శివగారి అంజయ్య, జింకల పర్వతాలు, బొంగు రాజేందర్‌రెడ్డి, తాండ్ర సాగర్,గదరాజు చందు, గోనే హరి, మంచాల కొండ య్య, పచ్చిమడ్ల మానస, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల సిద్దిరాములు, బీరెడ్డి ఇన్నారెడ్డి, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.