తపాస్‌పల్లి రిజర్వాయర్ పరిధిలోని ప్రతిపాదిత ఆయకట్టు పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చెరువులను గోదావరి జలాలతో నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఆలేరు ప్రాంతంలోని చెరువులు నింపేందుకు తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించి, అక్కడి నుంచి తన ప్రాంతానికి నీటిని తీసుకుపోయేందుకు మెయిన్ కాల్వల వద్ద ఉన్న గేట్ వాల్వ్‌ను కార్యకర్తలతో విప్పించడం సరికాదన్నారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని చెరువులను గతంలో విధంగా మత్తడి పడే వరకు నింపాలని డి మాండ్ చేశారు. చేర్యాల ప్రాంత ప్ర యోజనాల కోసం నిర్మించిన తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి జలాలు ఈ రైతులకు అందిన తర్వాత ఇతర ప్రాం తాలకు తీసుకెళ్తే బాగుంటుందని, సకాలంలో వర్షా లు లేక ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల అధికారులు తక్షణమే స్పందించి చేర్యాల ప్రాంత చెరువులు నింపాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.