చేర్యాల, అక్టోబర్ 10: కేసీఆర్ పాలనలో అధ్యాత్మికత వెల్లివిరిసిందని, కాంగ్రెస్ పాలనలో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం చేర్యాలలో దేవి స్నేహయూత్ నెలకొల్పిన అమ్మవారి మండపంలో దుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆకునూరులో భవాని రుద్రేశ్వర స్వామి వారి ఆలయంలో ఉల్లెంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు రుద్రేశ్వరి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
మద్దూరు మండలంలోని మర్మాములలో హనుమాన్ యూ త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారికి పూజలతోపాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేర్యాల కుడి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో దేవాలయాల అభివృద్ధికి పాలకులు నిధులు మంజూరు చేయలేదని, కేసీఆర్ పాలనలో దేవాలయాలకు నిధులు మంజూరు చేసి భక్తులకు వసతులు కల్పించినట్లు చెప్పారు.
అర్చకులకు నెలనెలా వేతనాలు వచ్చే విధంగా ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేసి దానికి మార్గదర్శకాలు ఇచ్చి వారికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మకు విడదీయరాని బంధం ఉందని, తొలి, మలి దశ ఉద్యమాల్లో బతుకమ్మ పాత్ర ఎం తో గొప్పదన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో చేర్యాల ప్రాంత వాసుల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ సాధించుకుందామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఏకానందం, మాజీ జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, మాజీ ఎంపీపీలు మేడిశెట్టి శ్రీధర్, వుల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్వీ ప్రధానకార్యదర్శి గదరాజుచందు, బైరగోని పశుపతి, సంతోష్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ సుమలతామల్లేశం, మాజీ సర్పంచ్‌లు స్రవంతీపర్శరాములు గౌడ్, రవీందర్ పాల్గొన్నారు.