మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, మే 9 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంగళవారం ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెదక్ నియోజకవర్గంలోని పలు విషయాలపై మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిందని, ఆ తర్వాత మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రికి విన్నవించారు.
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.40 కోట్లతో ప్రతిపాదనలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. మెదక్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారని, వెంటనే మంజూరుకు కావాల్సిన ఫైల్ చేయాల్సిందిగా మున్సిపల్ కార్యదర్శిని ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.