కాంగ్రెస్‌కు నమ్మి ఓటు వేస్తే కరెంట్ కష్టాల పాలవుతామని, కాంగ్రెస్ నాయకుల కు కుర్చీమీద ఉన్న యావ ప్రజల మీద లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, తుమ్మలపల్లి, పొడ్చన్‌పల్లి, పొడ్చన్‌పల్లి తండా, నాగ్సాన్పల్లి, శేరిపల్లి, గాంధారిపల్లి, జైపురం, అన్నారం, అబ్లాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే నట్టేట మునుగు తామన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
పాపన్నపేట, నవంబర్ 17: కాంగ్రెస్‌కు నమ్మి ఓటు వేస్తే కరెంట్ కష్టాల పాలవుతామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, తుమ్మలపల్లి, పొడ్చన్‌పల్లి, పొడ్చన్‌పల్లి తండా, నాగ్సాన్పల్లి, శేరిపల్లి, గాంధారి పల్లి, జైపురం, అన్నారం, అబ్లాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్మెంట్ భూముల నిబంధనలను సులభతరం చేసి భూ హక్కులు కల్పిస్తామన్నారు. పోడు భూములకు సైతం భూ హక్కులు కల్పించనున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎన్నికల్లో గెలవలెరన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పటికీ కుర్చీల కొట్లాట ఉంటుందన్నారు. గతంలో మైనంపల్లి కేవలం గిన్నెలు, గ్లాసులు ఇచ్చిండన్నారు.
నీళ్లు లేనప్పుడు బోర్లు ఎందుకు వేయలేదని, ఇప్పుడేందుకు వేస్తున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మవద్దని, నమ్మితే నట్టేట మునుగుతామని తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఆమె వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు సుదర్శన్, లింగారెడ్డి, దానయ్య, నవీన్, రాణి కిష్టయ్య, శ్రీకాంత్, విజయ తిరుపతి రెడ్డి, స్రవంతి శ్రీనివాస్, సబితా రవీందర్, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, డైరెక్టర్లు మనోహర్, వెంకటేశం, సాయిలు, పెంటయ్య, నాయకులు చావ బాపారావు, దుర్గయ్య, సాయిరెడ్డి, కిష్టారెడ్డి రఘు, భూషణం తదితరులు పాల్గొన్నారు.