వేగం పెంచాలి
జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పరిశీలించారు.
- అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
- అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
- ఏనిమిల్ బర్త్ కేర్ కేంద్రాన్ని 20 రోజుల్లో పూర్తి చేయాలి
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
- జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన
- వివిధ అభివృద్ధి నిర్మాణ పనుల పరిశీలన
మెదక్ మున్సిపాలిటీ, జూలై 4: జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పరిశీలించారు. అనంతరం రూ.2 కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఏనిమిల్ బర్త్ కేర్ కేంద్రం నిర్మాణ పనులు, రాందాస్ చౌరస్తాలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెర్స్ పనులను పరిశీలించారు. వాన కాలం వచ్చినందున పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్‌సాగర్, డీఈ మహేశ్‌కు సూచించారు.
ఎనిమిల్ బర్త్ కేర్ కేంద్రం పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వైకుంఠధామం నిర్మాణంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. స్థలం సరిగా లేదని, వానలు కురుస్తే నీరు చేరే అవకాశమున్నదని, వాన నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా గల రైతుబజార్‌ను సందర్శించారు. అనంతరం రూ.15 లక్షలతో చేపట్టిన ప్రెస్‌క్లబ్ భవనంలోని పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేవెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్ కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ పెర్క కిషన్, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, శివరామకృష్ణ, అరవింద్‌గౌడ్, శంకర్, కొండ శ్రీనివాస్, మోచి కిషన్, బాలరాజు, మున్సిపల్ ఏఈ బాలసాయగౌడ్, టెక్నికల్ ఇన్స్పెక్టర్ సలీం, వర్స్ ఇన్స్పెక్టర్లు దుర్గాపతి, పోచయ్య తదితరులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

