బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని, మెజార్టీ ఎంత అనేది చూడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి, మల్లుపల్లి, దొంతి, మగ్దుంపూర్, శభాష్‌పల్లి, పోతారం, పాకులపల్లి, గౌతజిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
శివ్వంపేట, నవంబర్ 1: నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం శివ్వంపేట మండలం దంతాన్పల్లి నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడ నుంచి కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి, మల్లుపల్లి, దొంతి, మగ్దుంపూర్, శభాష్‌పల్లి, పోతారం, తుపాకులపల్లి, గౌతజిగూడ గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో పదేండ్లల్లో సీఎం కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి పనులే సునీతాలక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు. తాను గతంలో సాధించిన మెజార్టీ కంటే అధిక మెజారిటీతో గెలుపు ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ విడిచిన బాణంగా సునీత అని అన్నారు. అనంతరం సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అన్న మదన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
కార్యక్రమం లో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా, జడ్పీ కో-ఆప్షన్ మన్సూ ర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రమణాగౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగేశ్వర్రావు, సర్పంచ్‌లు కన్నారం దుర్గేశ్, గైనిబైటి శ్రీనివాస్‌గౌడ్, పెంజర్ల శ్రీనివాస్‌యాదవ్, సోము అశోక్, రంగవల్లి పార్వతీసత్యం, మాధవరెడ్డి, అర్జున్, వెంకటేశ్, ఎంపీటీసీలు నువ్వుల దశరథ, ఆకుల ఇందిరాశ్రీనివాస్, మర్రి సత్తిరెడ్డి, లక్ష్మీకుమార్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, కో-ఆప్షన్ సభ్యుడు లాయక్, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, బీఆర్ఎస్ సీనియ ర్ నాయకులు కృష్ణారావు, సత్యనారాయణ, యాదాగౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, దుర్గం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.