నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతర కృషి
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.
తొగుట: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy ) నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ( Ramreddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో తొగుట మండలానికి 54 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు కాగా, వెంకట్రావుపేట గ్రామంలో సర్పంచ్ బండారి కవిత స్వామిగౌడ్‌తో కలిసి 11మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండలంలోని 54మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. రెండవ విడతలో కూడా ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని కొనియాడారు.
ఇందిరమ్మ ఇళ్లతో పాటు సీసీ రోడ్లు, తాగునీటి , సాగునీటి సమస్యల పరిష్కారం, రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఎమ్మెల్యేకృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, పార్టీ గ్రామ అధ్యక్షుడు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు వడ్డె లలిత, జహంగీర్, మిద్దె శ్రీనివాస్, నాయకులు పులిగారి లక్ష్మణ్, పాత్కుల స్వామి, మల్లేశం, సురేష్, కనకరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

