దుబ్బాక, సెప్టెంబర్18 : దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బుధవారం నీటి పారుదలశాఖ, పీఆర్(పంచాయతీ రాజ్) శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో డీఈలు బుచ్చయ్య, జీవన్, నరేశ్, బాలకృష్ణ, ఏఈలు ప్రసాద్, ప్రదీప్, ప్రకాశ్, సుమన్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో బీటీ రోడ్ల రెన్యూవల్, కొత్త రోడ్లకు ప్రతిపాదనల కోసం పీఆర్‌శాఖ ఎస్ఈ రత్నం నేతృత్వంలో సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.