దుబ్బాక, జూలై 20: ఆషాఢ బోనం.. తెలంగాణ ప్రజల జీవన వైవిధ్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణలో ఆచారమన్నారు. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిషన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.